విశ్వరూపం

downloadబెంగళూరు: కొడితే ఫోర్… లేదంటే సిక్సర్… టి20ల ద్వారా అభిమానులు కోరుకునే వినోదం ఇది. చెన్నై జట్టు సోమవారం సరిగ్గా ఇలాంటి వినోదాన్నే అందించింది. డాల్ఫిన్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా 16 సిక్సర్లు… 17 ఫోర్లు బాది 20 ఓవర్లలోనే 242 పరుగులు సాధించింది. చాంపియన్స్ లీగ్‌లో అత్యధిక స్కోరు (2013లో ఒటాగో జట్టు కూడా ఇన్నే పరుగులు చేసింది) రికార్డును చెన్నై సమం చేసింది.  సురేశ్ రైనా (43 బంతుల్లో 90; 4 ఫోర్లు; 8 సిక్సర్లు), రవీంద్ర జడేజా (14 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు)ల సంచలన హిట్టింగ్‌తో సూపర్ కింగ్స్… 54 పరుగుల తేడాతో డాల్ఫిన్స్‌పై నెగ్గింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓపెనర్ మెకల్లమ్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), డు ప్లెసిస్ (19 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా రైనా టి20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫ్రిలింక్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెల్‌పోర్ట్ (9 బంతుల్లో 34; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) విధ్వంసకర ఆటతీరు చూపినా ఫలితం లేకపోయింది.  వాన్ విక్ (7 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్), డెల్‌పోర్ట్ కలిసి తొలి మూడు ఓవర్లలోనే 56 పరుగులు చేయడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగినా… చెన్నై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో మ్యాచ్ చేజారకుండా చూశారు. మోహిత్ శర్మకు నాలుగు, బ్రేవో, నెహ్రాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సురేశ్ రైనాకి దక్కింది.
స్కోరు వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జోండో (బి) మహరాజ్ 7; మెకల్లమ్ (సి) స్మిత్ (బి) జోండో 49; రైనా (సి) డెల్‌పోర్ట్ (బి) ఫ్రిలింక్ 90; డు ప్లెసిస్ (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అలెగ్జాండర్ 30; ధోని (బి) ఫ్రిలింక్ 0; బ్రేవో (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అబోట్ 11; జడేజా నాటౌట్ 40; అశ్విన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 242.
వికెట్ల పతనం: 1-8; 2-99; 3-164; 4-174; 5-190; 6-222.
బౌలింగ్: మహరాజ్ 4-0-54-1; అబోట్ 4-0-37-1; అలెగ్జాండర్ 3-0-40-1; ఫ్రిలింక్ 4-0-52-2; ఫెలుక్‌వాయో 1-0-19-0; జోండో 2-0-19-1; స్మిట్ 2-0-17-0.
డాల్ఫిన్స్ ఇన్నింగ్స్: వాన్ విక్ (బి) ఎల్బీడబ్ల్యు అశ్విన్ 17; డెల్‌పోర్ట్ (బి) మోహిత్ 34; చెట్టి (సి) మోహిత్ (బి) బ్రేవో 37; మహరాజ్ (బి) మోహిత్ 8; వాన్ జార్స్‌వెల్డ్ (సి) స్మిత్ (బి) బ్రేవో 30; జోండో (సి) రైనా (బి) నెహ్రా 9; స్మిట్ (రనౌట్) 0; ఫెలుక్‌వాయో (బి) మోహిత్ 22; ఫ్రిలింక్ (బి) నె హ్రా 6; అబోట్ (బి) మోహిత్ 5; అలెగ్జాండర్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 188.
వికెట్ల పతనం: 1-34; 2-56; 3-90; 4-115; 5-138; 6-139; 7-139; 8-152; 9-165; 10-188.
బౌలింగ్: నెహ్రా 4-0-42-2; అశ్విన్ 4-0-38-1; మోహిత్ 4-0-41-4; జడేజా 3-0-35-0; రైనా 1-0-14-0; బ్రేవో 4-0-17-2.

Leave a Comment