ముసుగు వేసేయ్..

images (9)ముసుగులు వేసుకున్న ఈ మగువలను చూశారా? ప్రస్తుతం చైనాలోని బీచ్‌ల వద్ద ఈ ముసుగుల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. ‘ఫేస్ కినీ’లుగా పిలుస్తున్న ఈ ముసుగుల ట్రెండ్ ప్రస్తుతం చైనాలో ఎక్కువగా నడుస్తోంది. కొందరు ఈ ముసుగులకే పరిమితమవుతుండగా.. మరికొందరు దీంతోపాటు వచ్చే ఫుల్ బాడీ సూట్‌లను ధరిస్తున్నారు.

చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తున్నా.. ఎంచక్కా వేసుకుని బీచ్‌లో షికార్లు చేస్తున్నారు. ఈ ముసుగులు సూర్యుడి అతి నీల లోహిత కిరణాలతోపాటు జెల్లీ ఫిష్ కాటు నుంచి వారికి రక్షణ కల్పిస్తాయట. వీటి ధర రూ.300