‘మెట్రో’ పరిశీలన

81409948089_625x300మెట్రోరైలు పనుల్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పరిశీలించారు. ఆ ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. ఆపై సీఎం జయలలితతో భేటీ అయ్యారు.
– అధికారులతో వెంకయ్య సమీక్ష
– సీఎంతో భేటీ
చెన్నై: నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడమే లక్ష్యంగా మెట్రో రైలు పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాషర్‌మెన్ పేట నుంచి చెన్నై సెంట్రల్ – కోయంబేడు మీదుగా విమానాశ్రయానికి ఓ మార్గంలో, సెయింట్ థామస్ మౌంట్ నుంచి సైదాపేట మీదుగా సెంట్రల్‌కు మారో మార్గంలో ఈ పనులు సాగుతున్నాయి. 45 కి.మీ మేరకు నగరంలో మెట్రో రైలు పర్యటించనుంది. కోయంబేడు – ఆలందరూ వరకు పనులు ముగియడంతో మెట్రో రైలు ట్రయల్న్ సాగుతోంది.

గత వారం రైల్వే సేఫ్టీ కమిషన్ వర్గాలు ఈ మార్గంలో పరిశీలనలు జరిపి, నివేదికను సమర్పించాయి. కోయంబేడు – ఆలందూరు వరకు ముగిసిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆ కమిషన్ ప్రకటించింది. నవంబర్ నెలాఖరు నుంచి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలకు చర్యలు చేపట్టనున్నట్టు ఆ ప్రాజెక్టు వర్గాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నైకు వచ్చిన కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మీనంబాక్కం విమానాశ్రయం నుంచి సాగుతున్న మెట్రో రైలు పనుల్ని పరిశీలించారు. ఆలందూరు వద్ద కాన్వాయ్ నిలుపుదల చేసి, అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు.

అనంతరం మెట్రో రైలు అధికారులతో కలసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు మెట్రో రైలు పనులు పరిశీలించినట్టు వివరించారు. పనులు ఎంత వరకు వచ్చాయోనని అధికారులతో సమీక్షించినట్టు తెలిపారు. మెట్రో రైలు, ఇతర అభివృద్ధి పనులపై సీఎం జయలలితతో  చర్చించనున్నట్టు చెప్పారు. కాగా, మెట్రో రైల్ ట్రయల్న్ ్రసాగుతున్న దృష్ట్యా, అందులో ఆయన పయనించినట్టు సమాచారం. ఇక, మెట్రో రైలు పనుల పరిశీలనాన ంతరం సచివాలయానికి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. అక్కడ సీఎం జయలలితతో భేటీ అయ్యారు.

ప్రాజెక్టులపై సమీక్ష
ఈ భేటీలో రాష్ట్రంలో అమల్లో ఉన్న పలు ప్రాజెక్టులు, పథకాల గురించి వెంకయ్యనాయుడు దృష్టికి సీఎం జయలలిత తీసుకెళ్లారు. రాష్ట్రంలో కేంద్ర నగరాభివృద్ధి శాఖ నిధులతో సాగుతున్న పనుల్ని వివరించారు. నిర్లవరణీ కరణ పథకం, ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాల కల్పన, తాగు నీరు, వర్షపు నీటి సేకరణ, వంతెనల నిర్మాణాలు, నగ రీకరణ, పన్నెండు స్మార్ట్ సిటీల్లో అభివృద్ధి గురించి విశదీకరించారు. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి రూ.26 వేల కోట్లు త్వరిత గతిన మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడుకు  సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు. అలాగే, మెట్రో రైలు పనుల గురించి సమీక్షించారు.

Leave a Comment