కన్నడంలో ‘పవర్‌’ చూపిస్తున్న త్రిష

images (5)తెలుగులో మహేష్‌బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’ సినిమా కన్నడంలోకి ‘పవర్‌’ పేరుతో రీమేక్‌ అయిన విషయం విదితమే. పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌. తెలుగులో ‘దూకుడు’ సంచలన విజయం సాధించగా, కన్నడలోనూ అంతకన్నా పెద్ద హిట్‌ దిశగా దూసుకుపోతోంది. కన్నడ సినీ పరిశ్రమలో ‘పవర్‌’ సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అన్నట్టు కన్నడంలో త్రిషకి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. తొలి సినిమాతోనే సంచలన విజయం సొంతం చేసుకున్న త్రిషని ఇప్పుడక్కడ అంతా గోల్డెన్‌ లెగ్‌.. అని పిలుస్తున్నారట. తొలి రెండు వారాల్లోనే 15 కోట్లు వసూళ్ళు సాధించిన తొలి కన్నడ సినిమాగా ‘పవర్‌’ రికార్డులకెక్కింది. దాంతో త్రిషకిప్పుడు కన్నడలో వరుస ఆఫర్లు వచ్చిపడ్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన త్రిష కెరీర్‌ ‘పవర్‌’ సినిమాకి ముందు బాగా స్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె కెరీర్‌ తారాస్థాయికి చేరిందంటున్నారు తమిళ సినీ జనం. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూనే ఫ్లాప్‌ చవిచూసిన త్రిషకి కన్నడ సినీ పరిశ్రమ మాత్రం లక్‌ తీసుకొచ్చిందన్నమాట.

Leave a Comment