93 లక్షల కుటుంబాల డేటా నమోదు పూర్తి

images (7)హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన 93 లక్షల కుటుంబాల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలో కంప్యూటరీకరణ పూర్తవుతుందని అధి కారులు వివరించారు. 1.05 కోట్ల కుటుంబాల్లో ఇప్పటివరకు 93 లక్షల కుటుం బాల డేటాను కంప్యూటరీకరించినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 21 లక్షల కుటుంబాలను సర్వే చేయగా 8 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలింది పూర్తి చేసేందుకు ఇతర జిల్లాలకూ సర్వే పత్రాలను పంపిస్తున్నట్లు వివరించారు.  సమగ్ర సర్వే కంప్యూటరీకరణ పూర్తయినట్లు కలెక్టర్లు సర్టిఫికేషన్ చేసి పంపించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Leave a Comment