కాంగ్రెస్‌ను గౌరవిస్తేనే ఎన్‌సీపీతో పొత్తు: చవాన్

51406233429_625x300ముంబై: కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తేనే ఎన్‌సీపీతో పొత్తు ఉంటుందని, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘ఆత్మగౌరవంపై మేము రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు గౌరవం దక్కనట్లయితే.. మేము కూటమిలో కొనసాగలేం. సొంతంగానే పోరాడతాం’ అని గురువారం చవాన్ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు ఎన్‌సీపీ అంగీకరించని నేపథ్యంలో చవాన్ పైవిధంగా స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉంటే.. అందులో సగం అంటే 144 సీట్లు ఇవ్వాలని ఎన్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి వరకూ ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

Leave a Comment