బ్రీఫ్‌కేసులో వంటిల్లు..

41405970089_625x300జేమ్స్‌బాండ్ సినిమాలో విలన్ అణ్వాయుధాలకు సంబంధించిన రహస్య పత్రాలను ఉంచే స్టీలు సూట్‌కేస్ మాదిరిగా ఉన్న ఇది పైకే సూట్‌కేసు. లోపల మాత్రం చికెన్, ఇతర ఆహార పదార్థాలను కాల్చుకునేందుకు ఉపయోగపడే ‘గ్రిల్’కేసు. దీనిని తెరిచి లోపలున్న స్టాండ్లను సరిచేసి నిలబె డితే సరి.. ఇందులోని ట్రేలో కర్రబొగ్గులను వేసి వాటిని వెలిగించి పైన కావాల్సిన వాటిని కాల్చుకోవడమే. పనైపోగానే ట్రే కాస్త చల్లబడ్డాక తిరిగి మూసేసి బ్రీఫ్‌కేస్‌లా పట్టుకెళ్లొచ్చు.

ఏడున్నర అంగుళాల ఎత్తు, పదకొండున్నర అంగుళాల పొడవు ఉండే ఈ పోర్టబుల్ ‘బ్రీఫ్‌కేస్ బీబీక్యూ గ్రిల్’ను ఇంట్లో మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా తీసుకెళ్లొచ్చని, ప్రకృతి అందాలను చూస్తూ.. ఇష్టమైన ఆహారాన్ని వేడివేడిగా కాల్చుకుని తింటూ రుచులను ఆస్వాదించవచ్చని దీన్ని తయారుచేసిన చైనా కంపెనీవారు చెబుతున్నారు. ధర రూ.6 వేలు.
 

Leave a Comment