మహిళల వన్డే కూడా రద్దు

images (1)భారత్‌పై 2-0తో సిరీస్ ఇంగ్లండ్ కైవసం
లండన్: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల వన్డేతో పాటు ఈ రెండు దేశాల మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే కూడా రద్దయింది. లార్డ్స్‌లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో… మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరిగినందున… ఇంగ్లండ్‌కు ఐదు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ దక్కాయి.