సుప్రీంకోర్టులో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డికి వూరట

images (3)న్యూఢిల్లీ: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో వూరట లభించింది. ఆయనపై దాఖలైన అక్రమాస్తుల కేసును జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ బాబ్డేలతోకూడిన ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దినేష్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ నివేదిక దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికల్లో తేడాలున్నాయని ధర్మాసనం గుర్తించడంతో.. కేసు అధ్యయనానికి సీబీఐ న్యాయవాదులు గతంలో కొంత గడువు అడిగారు. సోమవారం ఈ కేసు విచారణ సమయంలో ఉమేష్‌కుమార్, ఆయన తరఫున న్యాయవాదులెవరూ హాజరుకాకపోవడంతో కేసు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Leave a Comment