డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ దీపికా పడుకొనే

download (4)అలా ఇలా కాదు.. మామూలుగా అయితే ఎవరూ దాని గురించి మాట్లాడటానికే ఇష్టపడరు. కానీ దీపిక మాత్రం, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా ట్వీటేసింది. దేనిగురించి? అంటారా.! ‘వక్షోజాల’ గురించి. అవును నిజంగా నిజం. ‘అవును.. నేను మహిళని.. నాకు వక్షోజాలున్నాయి.. క్లీవేజ్‌ వుంది.. మీకేమన్నా ఇబ్బందా?’ ఇదీ దీపికా పడుకొనే సంధించిన ‘ట్వీట్‌’. అక్షరం పొల్లుపోకుండా ఇంగ్లీషులో ఆమె ఈ కామెంట్‌ చేసింది. అంతే, అంతా షాకయ్యారు. అవ్వరా మరి.! ఇంతకీ దీపికా పడుకొనేకి ఎందుకు ఒళ్ళు మండిరదో తెలుసా.? ఆమె విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసేసిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందట. దాంతో దీపికా పడుకొనే ఇలా ట్వీటేసింది. దీపికా పడుకొనేకి మద్దతుగా బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లు కూడా ట్వీట్లు వేయడం గమనార్హం. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, క్రికెటర్‌ అజయ్‌ జడేజా తదితరులు దీపికా పడుకొనేకి మద్దతు పలికిన వారిలో వున్నారు. ‘ముందు మహిళల్ని గౌరవించండి.. ఆ తర్వాత కామెంట్లు వేయండి..’ అంటూ దీపికా పడుకొనే మరో ట్వీటేసింది.. తన ట్వీట్‌పై పెదవి విరుస్తోన్నవారి కోసం. దటీజ్‌ దీపికా పడుకొనే.

Leave a Comment