పిల్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

images (2)న్యూఢిల్లీ: సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థలు కుదుర్చుకున్న భూమి ఒప్పందాలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. అక్రమమని చెబుతున్న లావాదేవీలన్నీ ఢిల్లీ హైకోర్టు ప్రాదేశిక పరిధికి వెలుపల, అంటే హర్యానా, రాజస్థాన్‌లలో జరిగాయనీ, వాద్రా ఢిల్లీలో ఉంటున్నంత మాత్రాన ఈ అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించేలా వాద్రా సంస్థలతో 2005-12 మధ్య ఒప్పందాలు ఖరారయ్యాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.ఎండ్లాలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Comment