చైనాలో ధూమ్3 సంచలనం!

Dhoom3ముంబై: బాలీవుడ్ లో ధూమ్౩ చిత్రం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న చిత్రాల్లో ధూమ్ చిత్రం ఒకటిగా నిలిచింది. తాజాగా చైనాలో 2 వేల స్క్రీన్లలో విడుదలైన ధూమ్ 3 అక్కడి టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింవది. ఇప్పటికే టర్కి దేశంలో ధూమ్3 చిత్రం టాప్ టెన్ జాబితాలో 9వ స్థానం సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
చైనాలో టాప్ 10 చిత్రాల్లో ధూమ్3 చిత్రం 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది.  చైనాలో 1.35 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని యష్ రాజ్ ఫిల్మ్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనాలో భాషలో విడుదలైన రొమాంటిక్ చిత్రం ‘నో జూ నో డై’ అనే చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కినెట్టినట్టు సమాచారం.

Leave a Comment