‘రేపే ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల’

81406613481_625x300హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్కు రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఎల్.వేణుగోపాల్రెడ్డి వెలడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈలోగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి పెట్టాలని తెలిపారు.

ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామన్నారు. ఇప్పటికే ఈ ఇరురాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రొ.ఎల్. వేణుగోపాల్ రెడ్డి వివరించారు.

Leave a Comment