ఆర్టీపీపీలో ఆగిన విద్యుదుత్పత్తి

images (6)కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటులో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా మొదటి, మూడు దశల్లోని 1,2,5 యూనిట్లలో సుమారు 630 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఆగియింది. ఆర్టీపీపీలో మూడు దశల్లోని అయిదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగాల్సి ఉంది. ప్రతిరోజు అన్ని యూనిట్లలో విద్యుదుత్పత్తి పూర్తిలోడుతో జరగాలంటే సుమారు 17వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు సమస్య మంగళవారం కూడా కొనసాగితే 3,4 యూనిట్లలో ఉత్పత్తిపై ఆలోచిస్తామనీ..మరో యూనిట్‌లో ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉందని ఆర్టీపీపీ ముఖ్య ఇంజినీరు కుమార్‌బాబు చెబుతున్నారు.

Leave a Comment