దక్షిణాఫ్రికా 268/5
శ్రీలంకతో తొలి టెస్టు
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి రోజు నిలబడి… తర్వాత తడబడింది. బుధవారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే ఆల్విరో పీటర్సన్ (34) వికెట్‌ను కోల్పోయినా.. డీన్ ఎల్గర్ (187 బంతుల్లో 103; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో ఆదుకున్నాడు.
రెండు సెషన్ల పాటు క్రీజులో నిలబడి రెండో వికెట్‌కు డుప్లెసిస్ (80; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 125 పరుగులు జోడించాడు. అయితే మూడో సెషన్లో లంక బౌలర్లు జూలు విదిల్చి నాలుగు వికెట్లతో సఫారీ మిడిలార్డర్‌ను కూల్చారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. డి కాక్ (17), స్టెయిన్ (0)లు క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో లక్మల్, దిల్రువాన్ పెరీరా చెరో రెండు వికెట్లు పడగొట్టగా హెరాత్‌కు ఒక వికెట్ దక్కింది.
Recent Comments