ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!

71410027048_625x300లాస్ ఏంజిల్స్ : బహిరంగంగానే ఇలా గాఢ అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, కెనడా బిలినీయర్ కుమారుడైన ఇండో కెనడియన్ వ్యాపారవేత్త  జూలియన్ భారతీలు. కెనడాలోని విండ్సర్ నగరంలో నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ 49 ఏళ్ల సుందరి తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్ ఏకంగా 81 వేల డాలర్ల(రూ. 48 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు.

అయితే… ఈ ముద్దు వేలం వేసింది డబ్బు సంపాదించడం కోసం కాదండోయ్.. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం. ఈమె ముద్దు వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎల్టన్ జాన్స్ ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అందింది. అందుకే మరి.. భారీ మొత్తం చెల్లించి ముద్దును కొనుక్కున్నా.. జూలియన్ భార్య క్రిస్టీ కూడా ఫీలవ్వలేదట. జులియన్-క్రిస్టీల జంటకు ముగ్గురు పిల్లలు.

Leave a Comment