టీమిండియా టార్గెట్ 445 పరుగులు

Team Indiaసౌతాంప్టన్: మూడో టెస్టులో భారత్ కు ఇంగ్లండ్ 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది.

టీ విరామ సమయానికి 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాబ్సన్ 13, బాలన్స్ 38, బెల్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది.

Leave a Comment