వ్యక్తిత్వాన్ని తెలిపే ఫేస్‌బుక్ పోస్టింగ్‌లు

images (6)వాషింగ్టన్: ఫేస్‌బుక్ పోస్టింగ్‌ల ఆధారంగా ఇతరుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. కన్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఫేస్‌బుక్ ఉపయోగించే 100 మందిని వీరు ఎంపిక చేసుకుని వారి వ్యక్తిత్వానికి సంబంధించి వివరాలు సేకరించారు. వారి ఫేస్‌బుక్ పోస్టింగ్‌లను నిశితంగా పరిశీలించి.. దాని ఆధారంగా ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఎలాంటి పోస్టింగ్‌లు పెడుతున్నారనేది గుర్తించారు. అనంతరం 35 మంది అపరిచితులతో వీరి ఫేస్‌బుక్ పేజీలను పరిశీలింపజేసి వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయమని చెప్పారు. ఆ ఫలితాల ఆధారంగా.. ఫేస్‌బుక్ కార్యకలాపాలనుబట్టి వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చని తేల్చారు. 2011లో ఈ అధ్యయనం చేసిన అనంతరం ఫేస్‌బుక్.. ఇతరుల కార్యకలాపాలను సులభంగా చూడడానికి వీలులేకుండా వెబ్‌సైట్‌లో ఏర్పాట్లు చేసిందని.. ప్రస్తుతం ఇలా ఇతరుల ఫేస్‌బుక్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యక్తిత్వ లక్షణాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

Leave a Comment