15 నిమిషాలు ఫేస్ బుక్ ఆగిపోయింది!

download (2)వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ సేవలు బుధవారం ఉదయం మరోసారి స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15 నిమిషాలపాటు ఫేస్ బుక్ పనిచేయడం ఆగిపోయింది. సాంకేతికపరమైన మార్పులు చేసే క్రమంలో తమ వెబ్ సైట్ పనిచేయడం ఆగిపోయిందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాము సమస్యను వెంటనే గమనించి తగిన చర్యలు తీసుకున్నాం.. ఆతర్వాత ఫేస్ బుక్ పనిచేయడం ప్రారంభించిందని ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటలో వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంటకు చోటు చేసుకుంది. గతంలో కూడా ఫేస్ బుక్ సేవలు అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Leave a Comment