మాంచెస్టర్ టెస్టు: ఇంగ్లండ్ ఆధిక్యం 215

51407595419_625x300మాంచెస్టర్: భారత్తో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 215 పరుగుల ఆధిక్యం సాధించింది. 237/6 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. రూట్ (77), బట్లర్ (70) హాఫ్ సెంచరీలతో రాణించి ఇంగ్లండ్ను ఆదుకున్నారు. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, వరుణ్ అరోన్ మూడేసి వికెట్లు, పంకజ్ సింగ్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీసేన ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. మురళీ విజయ్, గంభీర్ క్రీజులో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.