నాకు ఏదీ ఓదార్పు ఇవ్వలేదు!

41405433599_625x300అర్జెంటీనా:  మరోసారి కప్ గెలుచుకునే  సువర్ణావకాశం చేజారిందనే ఆవేదనలో ఉన్నాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ.  ‘అసలు నాకు ఈ ప్రైజ్ అక్కర్లేదు. నేను దేన్నీ లెక్కచేయను. నాకు ఏదీ ఓదార్పును ఇవ్వలేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే చాలామంది తమ జట్టు ఈ టోర్నీలో చూపిన ప్రతిభపై సంతోషం వ్యక్తం చేసినా ఇంకొందరు మాత్రం తమ కోపాన్ని విధ్వంసకర రీతిలో వ్యక్తం చేశారు.  ఫైనల్ అవగానే కొందరు ఫలితంతో సంబంధం లేకుండా తమ దేశ పతాకాలతో తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. మెస్సీ బృందాన్ని పొగుడుతూ బాణసంచా కాల్చారు.
 
జట్టు సభ్యులతో స్వదేశానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ.. తనకు ఎవరి ఓదార్పు అక్కర్లేదని స్పష్టం చేశాడు.  ఫిఫా వరల్డ్ కప్‌లో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన లియొనల్ మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డు ఇవ్వడంపై అర్జెంటీనా దిగ్గజం డీగా మారడోనా మండిపడటంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మెస్సీ ఆ అవార్డుకు అర్హుడు కాడని విమర్శించాడు. ఒకవేళ సాధ్యమైతే అతనికి స్వర్గాన్ని బహూకరిస్తానని వ్యంగ్యోక్తి విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ‘అసలు నాకు ఈ ప్రైజ్ అక్కర్లేదు. నేను దేన్నీ లెక్కచేయను. నాకు ఈ ప్రైజ్ ఓదార్పు ఇవ్వలేదు’ అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు మెస్సీ.

Leave a Comment