‘లవ్ జిహాద్’ పేరిట అంతర్జాతీయ కుట్ర: శివసేన

download (5)ముంబై: హిందువుల సంస్కృతి దెబ్బతీసేందుకు ‘లవ్ జిహాద్’ పేరిట అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. ‘లవ్ జిహాద్’ అడ్డుకోవడానికి పోరాటం సాగించాలని పిలుపునిచ్చిన బీజేపీ నేత స్వామి ఆదిత్యనాథ్ కు శివసేన మద్దతు తెలిపింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. హిందూ యువతులు అప్రమత్తంగా ఉండాలని తమ అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్ లో శివసేన పేర్కొంది.
‘లవ్ జిహాద్’ పిలుపునిచ్చిన వారికి తగిన గుణపాఠం నేర్పాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జిహాద్ (పవిత్రయుద్ధం) పేరిట ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని ఎడిటోరియల్ తెలిపారు. దేశ సమైక్యత దెబ్బతీసేందుకు లష్కరే ఏ తోయిబా, సిమీ, అల్ ఖైదా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సామ్నా హెచ్చరించింది.
ప్రేమ పేరుతో హిందూ యువతను ముఖ్యంగా అమ్మాయిలనూ టార్గెట్ చేసుకుని మత మార్పిడి చేయాలనే లక్ష్యంతో ‘లవ్ జిహాద్’ పేరుతో ఓ పథకాన్ని ఉగ్రవాదసంస్థలు రచిస్తున్నాయి.

Leave a Comment