‘నన్నూ గుర్తించండి’

61407613118_625x300వికలాంగ క్రీడాకారుడు అంజనారెడ్డి ఆవేదన
 హైదరాబాద్: వికలాంగ బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పటికీ తననెవరూ గుర్తించడం లేదని కరీంనగర్‌కు చెందిన వన్నెల అంజనారెడ్డి ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తనను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడినా 2003 నుంచి 2010 వరకు పలు పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశాడు. అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు శనివారం సచివాల యానికి వచ్చిన అంజనకు చేదు అనుభవం ఎదురైంది.

అపాయింట్‌మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సోమవారం సీఎంను కలిసే వెళతానని చెప్పాడు. అయితే తన కుటుంబం పేదరికంలో లేదని, తగిన గుర్తింపు కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపాడు. 2003లో ఇజ్రాయెల్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రెండోస్థానం, 2006లో తొమ్మిదో పసిఫిక్ గేమ్స్‌లో కాంస్య పతకం, 2008 రెండో ఆసియా కప్‌లో కాంస్యం, 2009 ఐడబ్ల్యూఏఎస్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించినట్టు
 అంజన చెప్పాడు.