ఆ ఒక్కటి అడగొద్దు

61407953738_625x300హీరోయిన్లు ఒక విషయం మినహా వేటి గురించి అయినా చకచకా, కామాలు, ఫుల్‌స్టాప్‌లు లేకుండా చెప్పేస్తుంటారు. ఆ ఒక్క విషయం అంటే వ్యక్తిగతం. ఈ అంశానికొచ్చేసరికి ముఖంలో రంగులు మారిపోతాయి. నటి మీరాజాస్మిన్ ఇందుకు అతీతం కాదు. ఈమె గత ఏడాది ఐటీ కంపెనీలో పనిచేసే అనిల్‌జాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చట్టబద్ధం చేయడంలో సమస్యలు తలెత్తుతాయనే ప్రచారం హోరెత్తుతోంది. కారణం అనిల్‌జాన్‌కు ఇంతకుముందే వేరే యువతితో వివాహం జరిగిన విషయం తెల్సిందే.
 
 ఈ సమస్య తలకెక్కించుకోకుండా నటి మీరాజాస్మిన్ జాలీగా మళ్లీ నటనపై గమనం సారిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజ్ఞాని అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో విజ్ఞాని చిత్రంలో నటించడానికి అంగీకరించానన్నారు. ఈ చిత్రం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కాగా తన వివాహం చట్టబద్ధత వ్యవహారంలో సమస్య గురించి ప్రశ్నించగా దయచేసి ఆ విషయం గురించి మాత్రం అడక్కండి అంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు.