‘హెరాల్డ్’ సమన్లపై సోనియా, రాహుల్ పిటిషన్

81406734237_625x300న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన సమన్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7న స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ పాటియాలా కోర్టు పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారంతా విచారణకు హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా గత నెలలో ఆదేశాలిచ్చారు.

Leave a Comment