‘మైఖేల్‌ జాక్సన్‌తో పోల్చొద్దు ప్లీజ్‌..’

images (1)నన్ను మైఖేల్‌ జాక్సన్‌తో పోల్చొద్దు ప్లీజ్‌.. అంటున్నాడు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌. డాన్సుల్లో హృతిక్‌ రోషన్‌ని బాలీవుడ్‌ మైఖేల్‌ జాక్సన్‌ అంటుంటారు. హృతిక్‌ రోషన్‌కీ మైఖేల్‌ జాక్సన్‌ అంటే బోల్డంత అభిమానం. మైఖేల్‌ జాక్సన్‌ డాన్సులు చూసే తాను పెరిగననీ, సినిమాల్లో డాన్సులు చేస్తున్నాననీ హృతిక్‌రోషన్‌ సందర్భం వచ్చిన ప్రతిసారీ వ్యాఖ్యానిస్తుంటాడు. కానీ, తనను జాక్సన్‌తో పోల్చితే తనకు ఇబ్బందిగా వుంటుందని హృతిక్‌ రోషన్‌ చెప్పుకొచ్చాడు. ‘డాన్సుల్లో నేనింకా జాక్సన్‌ స్థాయికి ఎదగలేదు.. ఆ స్థాయి రావాలంటే ఇప్పట్లో నాకు రాదేమో.. భవిష్యత్తులోనూ సాధ్యం కాదేమో..’ అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు హృతిక్‌ రోషన్‌. మైఖేల్‌ జాక్సన్‌ తనలాంటి చాలామందికి దేవుడనీ, దేవుడితో పోల్చుకోవడం ఎవరికీ మంచిది కాదని హృతిక్‌ రోషన్‌, మైఖేల్‌ జాక్సన్‌పై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

Leave a Comment