హంపి పెళ్లికూతురాయెనే…

61407964032_625x300వైభవంగా చెస్ స్టార్
విజయవాడ: చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. విజయవాడకే చెందిన పారిశ్రామికవేత్త దాసరి అన్వేష్‌తో బుధవారం రాత్రి ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా హంపి వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చెస్ క్రీడాకారులు, కృష్ణా జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వివాహానికి హాజరయ్యారు