పార్లమెంటు క్యాంటీన్‌లోబిర్యానీ!

images (2)న్యూఢిల్లీ: హైదరాబాదీ బిర్యానీ ఇకపై పార్లమెంటు సభ్యులందరికీ అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనూలో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి నిర్ణయించారు. మంగళవారం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ మేరకు విలేకరులకు తెలిపారు. హైదరాబాదీ బిర్యానీతోపాటు ‘మిర్చి కా సాలన్’, ‘షాయి తుకడా’, ‘ఖుబానీ కా మీఠా’ వంటి కొత్త వంటకాలను ప్రవేశపెడతామన్నారు. పార్లమెంటులోని వంటవారికి ఈ వంటకాలపై హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న క్షిపణుల పరిశ్రమను మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని రక్షణ కమిటీ సమావేశంలో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీ లాడ్స్‌కింద ప్రస్తుతం కేటాయిస్తున్న మొత్తాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచాలని ఎంపీ లాడ్స్ సమావేశంలో కోరినట్లు తెలిపారు.

Leave a Comment