నూడ్ గా ఫోజులివ్వను: కేట్ అప్టన్

41407642569_625x300లాస్ ఏంజెలెస్: తాను నగ్నంగా ఫోజులివ్వబోనని ప్రముఖ అమెరికా మోడల్ కేట్ అప్టన్ అంటోంది. సోషల్ మీడియా కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను నూడ్ గా ఫోటోలు దిగితే అవి సోషల్ మీడియాలో దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఆమె భయపడుతోంది. నగ్నంగా ఫోజులు ఇవ్వడం ఇష్టమే అయినా, సోషల్ మీడియా కారణంగా ఆ పని చేయలేకపోతున్నానని వాపోయింది 22 ఏళ్ల ఈ అందాల సుందరి.

అసలు నగ్నత్వం అనేది ఒక కళ, సౌకుమార్యమైన దేహంతో అందాన్ని ప్రదర్శించడం కూడా ఒక ఆర్టేనని లెక్చర్ దంచింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, కొన్ని బ్లాగుల కారణంగా జాగ్రత్తగా ఉండాల్సివస్తోందని తెలిపింది. అయితే మోడలింగ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేట్ అప్టన్ ఇప్పటికే ఉదారంగా అందాలు ఆరబోసింది.