టాయిలెట్ నీటితో హాలీవుడ్ స్టార్ ఐస్ బకెట్ ఛాలెంజ్!

download (2)ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఐస్ బకెట్ చాలెంజ్ పేరుతో మంచినీటిని వృధా చేస్తున్నారంటూ హాలీవుడ్ నటుడు, ది బార్న్ ఐడెంటిటీ హీరో మాట్ డేమన్ నిరసన వ్యక్తం చేస్తూ కొత్త పద్దతిని ఎంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మంచినీరు, తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని,  అనేక పేద దేశాల్లో మంచి నీరు చాలా విలువైన వస్తువుగా మారిందని.. అలాంటి నీటిని వృధా చేస్తున్నారంటూ.. టాయిలెట్ నీటి ద్వారా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు.
మంచినీటిపై అవగాహన కల్పించేందుకు ఈ పద్దతిని ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ హాలీవుడ్ నటుడు తన ఫౌండేషన్ ద్వారా మంచినీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను మంచినీటితో చేస్తే ప్రతికూల సంకేతాలను తాను పంపినట్టు అవుతుందని.. తాగునీరుపై అవగాహన కలిగించేందుకు మాత్రమే తాను ఈ రూపంలో ఛాలెంజ్ విసిరానని తెలిపారు. పలు టాయిలెట్ల నుంచి సేకరించిన నీటిని తనపై కుమ్మరించుకుని ఐస్ బకెట్ ఛాలెంజ్ ను తన సహచర నటుడు జార్జ్ క్లూనీ, సంగీత దర్శకుడు బానో, అమెరికన్ ఫుట్ బాలర్ టామ్ బ్రాడీలకు సవాల్ విసిరాడు.