పోలీసులకు ఫిర్యాదు చేస్తా: అమీర్

41388863038_625x300ముంబై: ఎవరైనా తనను లంచం అడిగితే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానని బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అన్నారు. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం తాను ఎప్పుడు లంచం ఇవ్వలేదని అమీర్ తెలిపారు. . సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) సీఈవో రాకేశ్ కుమార్ అరెస్ట్ పై స్పందించిన ఆయన ఒకవేళ ఎవరైనా అడిగినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని అన్నారు.
రాకేశ్ కుమార్ అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని, తాను ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని పీకే పోస్టర్ ఆవిష్కరణ సందర్బంగా అన్నారు. ‘మోర్ దౌకీ కే బిహావ్’ చత్తీస్ ఘడ్ ప్రాంతీయ చిత్రం కోసం 70 వేల రూపాయలు లంచం అడిగారనే ఆరోపణలపై రాకేశ్ కుమార్ అరెస్ట్ చేసి మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.