చైనా మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం

China mapనూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా రూపొందించిన తాజా మ్యాప్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్ర పటాల్లో చూపినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారిపోదని, అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొంది. అరుణాచల్‌లోని వివాదాస్పద ప్రాంతాలను, దక్షిణ చైనా సముద్రాన్ని చైనాలో అంతర్భాగంగా చూపుతూ ఇటీవల ఆ దేశం విడుదల చేసిన మ్యాప్‌లపై.. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులను వివరణ కోరగా వారు పైవిధంగా స్పందించారు.

 అరుణాచల్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని, ఇదే అంశాన్ని పలుమార్లు చైనా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతత్వంలోని బృందం కూడా చైనా ప్రతినిధుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని వెల్లడించారు.

Leave a Comment