మరోసారి తల నరికితే.. తీవ్ర ప్రతిస్పందన

41399906716_625x300తొలిరోజే పాక్‌కు ఆర్మీ కొత్త చీఫ్ హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత సైనిక దళాల ప్రధానాధికారిగా విధులకు హాజరైన తొలి రోజే దల్బీర్‌సింగ్ సుహాగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో జవాన్ల తల నరకడం లాంటి చర్యలకు దిగితే భారత్ స్పందన తగిన రీతిలో ఉంటుందన్నారు. ఆ స్పందన చాలా తీవ్ర స్థాయిలో వెంటనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఆర్మీ కొత్త చీఫ్‌గా శుక్రవారం ఇక్కడ సైనిక దళాల నుంచి గౌరవ వందనం అందుకున్న అనంతరం సుహాగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

గతేడాది జనవరి 8న పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఓ భారత జవాను లాన్స్‌నాయక్ హేమరాజ్ తలను పాక్ సేనలు నరికి వేసిన ఘటనను విలేకరులు ప్రస్తావించగా సుహాగ్ పైవిధంగా స్పందించారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  
 

Leave a Comment