టాప్-3లో భారత్

61408045710_625x300

  1. ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్

కోల్‌కతా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-4లో స్వర్ణం సాధించిన దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకింది. గతంలో ఏడో స్థానంలో ఉన్న టీమిండియా ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకొని టాప్-3లో నిలిచింది. ఇదే టోర్నీలో రజతంతో సరిపెట్టుకున్న పురుషుల జట్టు నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది.  
 
భారత్‌కు రజతం
మరోవైపు చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సంజయ్ బోరో, ధనిరామ్, అతుల్ వర్మల బృందం 0-6తో కొరియా చేతిలో ఓటమి పాలైంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచిన భారత్… ప్రిక్వార్టర్స్‌లో 6-2తో ఇరాన్‌పై; క్వార్టర్స్‌లో 5-1తో చైనీస్‌తైపీపై; సెమీస్‌లో 6-2తో జపాన్‌పై నెగ్గింది. ఈ పోటీలకు భారత ఆర్చరీ సంఘం ద్వితీయ శ్రేణి జట్టును పంపింది.