ఇన్ఫీ సిక్కాకు రూ. 8 కోట్ల షేర్లు

download (2)బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కాకు కంపెనీ రూ. 5 చొప్పున 22,794 షేర్లను కేటాయించింది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేరు ధర (రూ. 3,600) ప్రకారం వీటి విలువ సుమారు రూ. 8.2 కోట్లు ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో కీలకమైన మైలురాళ్లు అధిగమించడం, ఉద్యోగంలో కొనసాగడం తదితర అంశాలను బట్టి ఈ షేర్లు ఆయనకు పూర్తిగా లభిస్తాయి. సిక్కా వార్షిక జీతభత్యాలు సుమారు రూ. 30 కోట్లు.