ఏపీ, తెలంగాణలకు అన్యాయం: వైఎస్సార్ సీపీ

71402563225_625x300న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొత్తపల్లి గీతలతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి పార్లమెంటు వెలుపల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని, కమిటీ వేసి చర్చించి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు.
 
 ఆ కమిటీ ఏమిటో, ఎప్పుడు వేస్తారో..! ఈ ప్రాజెక్టుల్లో వేటిని ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం’’ అని అన్నారు. ‘‘విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో కనెక్టివిటీ, విశాఖకు మెట్రో రైలు ప్రస్తావన లేదు. అనేక ఏళ్ల కిందట మంజూరై, బడ్జెట్‌లో ఆమోదం పొంది అమలుకు నోచుకోని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, కర్నూలు-మంత్రాలయం సహా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ప్రస్తావనే లేదు’’ అని విమర్శించారు.

Leave a Comment