బీజింగ్: పిల్లలను, జంతువులను దత్తత తీసుకోవడం మనకు తెలుసు. అయితే చైనాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు మాత్రం దత్తమాత కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు అమ్మగా దత్తతకు వచ్చే మహిళకు రూ.98 లక్షలు ఇస్తానని చెబుతున్నాడు. ఆమె బాగా చదువుకుని ఉండాలని, వయసు కనీసం 57 ఏళ్లు ఉండాలని, మత్తుపదార్థాలు వాడిన చరిత్ర ఉండకూడదని, విదేశీయాన అనుభవముండాలని షరతులు పెడుతున్నాడు. ఈ ఆఫర్ వివరాలు, తన ఫోన్ నంబర్, ఓ గిన్నెలో డబ్బులు ప్రదర్శిస్తూ అతడు గువాంగాన్‌లోని ఓ పార్కులో తీయుంచుకున్న ఫొటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయని ’ecns.cn’ అనే వెబ్‌సైట్ తెలిపింది.
Recent Comments