చైనా సైనికుల చొరబాటు

images (2)న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బుధవారం అధికారిక పర్యటన కోసం భారత్‌లోకి అడుగుపెట్టడానికి కొన్ని గంటల ముందు.. మరో వందమంది చైనా సైనికులు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు! విశ్వనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాశ్మీర్‌లోని చుమార్ లోకి చొరబడిన చైనా సైనికుల్లో కొందరు మంగళవారం తిరిగి వెళ్లినా బుధవారం మరో వందమంది చైనా జవాన్లు చొరబడ్డారు.

భారత్ కూడా మరింత మంది సైనికులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లి డ్రిల్లు నిర్వహించింది. చైనా జవాన్లు కూడా ఆ పనిచేశారు. ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చుసూల్‌లో ఫ్లాగ్ మీటింగ్ జరిపి, చొరబాటుపై చర్చించినా ప్రతిష్టంభన తొలగలేదు.

Leave a Comment