మహిళా టెర్రరిస్టులున్నారు.. జాగ్రత్త!!

imagesలండన్ : ఉగ్రవాదం రకరకాల రూపాలు సంతరించుకుంటోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు ఏకంగా మహిళలను కూడా రంగంలోకి దించేస్తున్నారు. తాము సృష్టిస్తున్న మారణ హోమంలో వాళ్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఐఎస్ఐఎస్లో ఏకంగా ఒక మహిళా విభాగాన్నే సృష్టించి.. కొత్తగా నియామకాలు చేస్తున్నారు. ఈ విభాగంలో 60 మంది బ్రిటిష్ మహిళలు కూడా ఉన్నారట. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్యలోని వాళ్లేనని తాజాగా తెలిసింది.

మహిళ టెర్రరిస్టులకు నెలనెలా వేతనాలు కూడా చెల్లిస్తున్నారు. తమ కూతుళ్లు సిరియా ఉగ్రవాదులుగా మారుతున్నారని తెలిసి బ్రిటన్‌లోని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ పిల్లల జీవితాల్ని బాగు చేసుకునేందుకు సహాయం చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. సిరియాలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అమెరికా సహాయం చేస్తోంది. అదే ఇరాక్‌కు వచ్చేసరికి ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులు చేస్తోంది. అగ్రదేశం ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం మధ్య ఆసియా దేశాలకు శాపంగా మారుతోందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

Leave a Comment