కోహ్లి కూడా వచ్చేశాడు

images (1)ముంబయి: విరాట్ కోహ్లి.. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ బాటలో నడిచాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో తనూ ఓ జట్టుకు సహ యజమాని అయ్యాడు. గోవా ఫ్రాంఛైజీలో అతను వాటాదారు అయ్యాడు. ఐతే ఇది ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయం కాదని విరాట్ చెప్పాడు. ”కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను మరీ చిన్నవాడినేమో అనిపిస్తుంది. కానీ నమ్మకం కుదిరినపుడు ఏమైనా చేయొచ్చు. భారత్‌లో ఫుట్‌బాల్ ఎదగాలన్న ఆశతో నేను ఐఎస్ఎల్‌లోకి వచ్చా. దీంతో పాటు భవిష్యత్తుకు తగ్గ వ్యాపారం ఇదని భావించా. ఎప్పటికీ క్రికెట్లోనే కొనసాగలేం కదా. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత అవకాశాలు చూసుకుంటున్నా. ఐఎస్ఎల్ నన్నెంతో ఉద్వేగానికి గురి చేయడంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా” అని కోహ్లి తెలిపాడు

Leave a Comment