ఆ సినిమాకి ఆమే ప్రచారాస్త్రం.!

images (1)శ్వేతా బసు ప్రసాద్‌.. వ్యభిచారం చేసిందంటూ వార్తల్లోకెక్కిన ఈ ‘కొత్త బంగారు లోకం’ ఫేం హీరోయిన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేసిన సినిమా ఒకటి విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా ప్రమోషన్‌లో శ్వేత గ్లామరస్‌ స్టిల్స్‌ని ప్రముఖంగా వాడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్‌ అంటేనే అంత. ఆ మధ్య శ్రీహరి నటించిన ఓ సినిమాకి ముందు వేరే టైటిల్‌ అనుకుని, ఆయన మరణానంతరం ‘రియల్‌ స్టార్‌’ అనే టైటిల్‌ పెట్టేశారు. ఇక, శ్వేత విషయానికొస్తే.. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె కెరీర్‌ అటకెక్కిపోయింది. ఐటమ్‌ సాంగ్స్‌కీ ‘సై’ అనేసింది. అయినా ఆమెకు సరైన అవకాశాలు రాలేదాయె. దాంతో, ఆమె తప్పుడు మార్గంలో నడిచిందని, ఆమె ‘అరెస్ట్‌’ వార్తలతో అసలు విషయం బయటపడిరది. ఓ బాలీవుడ్‌ దర్శకుడు తన సినిమాలో శ్వేతకు అవకాశమిస్తానన్నాడుగానీ, మళ్ళీ ఆ ఊసెత్తలేదు. టాలీవుడ్‌లోనూ కొందరు శ్వేతా బసు ప్రసాద్‌కి అవకాశాలు ఇస్తామంటున్నారు.. ఇచ్చేవాళ్ళెందరో, శ్వేత మళ్ళీ తెరపై కన్పిస్తే తప్ప తెలియదు. మొత్తానికి శ్వేతా బసు ప్రసాద్‌ ఓ సినిమాకి పబ్లిసిటీ పరంగా ప్లస్‌ అవుతోందిప్పుడు. ఆ సినిమా హిట్టయితే శ్వేతకి మళ్ళీ పాపులారిటీ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Leave a Comment