ప్రేమ విషయంలో చాలా తప్పులు చేశా

download (1)లాస్ ఏంజిల్స్: తన వ్యక్తిగత జీవితంలో చాలా తప్పులు చేశానని అమెరికా గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ పాశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మూడు పెళ్లిళ్లు విచ్ఛిన్నం కావడం, ఓ నిశ్చితార్థం పెళ్లి పీటల వరకు వెళ్లకనే వీగిపోవడం, ఈ మధ్య ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ దూరం కావడంతో జెన్నిఫర్ను బాధించాయి. ప్రేమ విషయంలో తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్ల జరగకుండా ప్రయత్నిస్తున్నాని అన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన 45 ఏళ్ల జెన్నిఫర్ ఓ ఇంటర్య్వూలో వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లిళ్ల గురించి మాట్లాడారు.


‘నేను చాలా తప్పులు చేశానని అందరికీ తెలుసు. ప్రతీసారి పొరపాటు చేశా. చాలా బాధపడ్డా. ఇలాంటి తప్పులు మళ్లీ చేయరాదు. నా పిల్లలు తండ్రి లేకపోవడం లోటుగా భావిస్తున్నారని తెలుసు. వారిని కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని జెన్నీఫర్ అన్నారు.
 

Leave a Comment