సల్మాన్‌ నయా గర్ల్‌ఫ్రెండ్‌ ఆమేనట

downloadసల్మాన్‌ఖాన్‌ ఎప్పుడూ ఖాళీగా వుండడు. బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అయిన సల్మాన్‌ఖాన్‌, ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆ మాటకొస్తే పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే అతనికి కలగడంలేదు. ఎందుకూ.? అని సల్మాన్‌ఖాన్‌ని అడిగినా అతను సమాధానం చెప్పేందుకు ఇష్టపడడు. ‘ఏమో.. నాకు కళ్యాణ ఘడియలు రావేమో..’ అని నిరాశా నిస్పృహలతో ఒక్కోసారి సమాధానమిస్తుంటాడు సల్మాన్‌ఖాన్‌. ఐశ్వర్యారాయ్‌ నుంచి కత్రినాకైఫ్‌ దాకా సల్మాన్‌ఖాన్‌ లైఫ్‌లో చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌ వుండేవారు. కత్రినా తర్వాత కూడా జరీన్‌ఖాన్‌, అసిన్‌.. ఇలా కొందరితో సన్నిహితంగా మెలిగిన సల్మాన్‌ఖాన్‌ తాజాగా జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ని వెంటేసుకుని బాలీవుడ్‌ పార్టీలకు తిరుగుతున్నాడట. ‘కిక్‌’ సినిమాలో సల్మాన్‌తో జాక్వెలైన్‌ నటించిన విషయం విదితమే. ఆ సినిమాకి జాక్వెలైన్‌ని ఎంపిక చేసినప్పటినుంచీ సల్మాన్‌ తనతోపాటు జాక్వెలైన్‌ని తిప్పుతున్నాడట పార్టీల్లో. ‘సినిమా అన్నాక ప్రమోషన్‌ అవసరాలుంటాయి కదా.. అలా కలిసి తిరిగాం.. అందులో తప్పేంటి..’ అని జాక్వెలైన్‌ చెబుతోంటే, సల్మాన్‌ఖాన్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ వ్యవహారం తెలిసినవారంతా, జాక్వెలైన్‌ ఎన్నాళ్ళు సల్మాన్‌తో వుండగలుగుతుందో.. అని లెక్కలు కడుతున్నారట. ప్రస్తుతానికైతే జాక్వెలైన్‌, సల్మాన్‌ఖాన్‌కి గర్ల్‌ఫ్రెండ్‌.. అని బాలీవుడ్‌ సినీ జనం తేల్చి చెబుతున్నారు. జాక్వెలైన్‌ కూడా అలానే అనుకోమంటోంది.

Leave a Comment