తేరుకుంటున్న జమ్మూ కాశ్మీర్ జనజీవనం

images (1)శ్రీనగర్: వరదల తాకిడితో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో జనజీవనం నెమ్మదిగా తేరుకుంటుంది. క్రమంగా వరద నీరు తగ్గుతుండడంతో ప్రజలు కాస్త వూపిరి పీల్చుకుంటున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మంగళవారం రాకపోకల కోసం తెరిచారు. 15వ రోజూ సహాయక చర్యలు కొనసాగాయి. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం ప్రభుత్వం నిరంతరం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీనగర్‌లోని జవహార్ నగర్ ప్రాంతంలో మంగళవారం 13 మృతదేహాలను వెలికితీశారు. దీంతో వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి సంఖ్య 200కు చేరింది. ఓ ఇంటిలో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పాక్షికంగా కుళ్లిపోయిన ఆ మృతదేహాలను కుక్కలు తింటుండడం అత్యంత బాధాకరమైన విషయం. మృతులెవరనేది ఇంకా నిర్ధరణ కాలేదు.
మరోవైపు వరద నీటి తోడివేసే కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా జోధ్‌పూర్, రాయ్‌పూర్ నుంచి మరిన్ని నీటిని తోడే యంత్రాలను తెప్పించారు. ఇప్పటివరకు మొత్తం 2.37లక్షల మందిని సహాయక సిబ్బంది రక్షించారు. న్యూయార్క్ నుంచి 21 సహాయక బోట్లను ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఉచితంగా తరలించింది.

Leave a Comment