జెన్నిఫర్ ఇంట్లో మాజీ బాయ్ ఫ్రెండ్ మకాం

71390079107_625x300లాస్ ఏంజిల్స్: రెండున్నరేళ్ల పాటు డేటింగ్ చేసిన పాప్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్, డాన్సర్ కాస్మర్ స్మార్ట్ తమ బంధానికి ఇటీవల కటీఫ్ చెప్పేశారు. కాగా లాస్ ఏంజెల్స్లోని లోపెజ్ వీధిలోని జెన్నిఫర్ మూడు బెడ్రూమ్ల ఇంట్లోనే కాస్మర్ ఇప్పటికీ మకాం వేశాడు.

జెన్నిఫర్ ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండటం లేదు. కొత్త ఆల్బమ్ ప్రమోషనల్ టూర్కు వెళ్లింది. ఆమె లాస్ ఏంజిల్స్కు తిరిగొచ్చిన వెంటనే కాస్మర్ ఇంటిని ఖాలీ చేస్తాడని భావిస్తున్నారు. జెన్నిఫర్ నివాసానికి సమీపంలోనే అద్దె ఇంటి కోసం కాస్మర్ అన్వేషిస్తున్నట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. 44 ఏళ్ల జెన్నిఫర్, 27 ఏళ్ల కాస్మర్ల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

Leave a Comment