సానియా జోడి

download (3)పాన్ పసిఫిక్ ఓపెన్
 టోక్యో: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ జంట 6-3, 3-6, 10-8తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-లీసా రేమండ్ (అమెరికా) ద్వయంపై గెలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌ల్లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను నాలుగేసిసార్లు కోల్పోయాయి. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో సానియా జంట కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బెన్సిచ్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లతో సానియా-కారా బ్లాక్ తలపడతారు.

Leave a Comment