జోయాలుక్కాస్ గోల్డెన్ కార్నివాల్ లక్కీడ్రా

carnivalluckydrawజోయాలుక్కాస్ గోల్డెన్ కార్నివాల్ హైదరాబాద్, విజయవాడ జోన్‌లకు సంబంధించి లక్కీడ్రా హైదరాబాద్‌లోని పంజాగుట్ట షోరూమ్‌లో గురువారం జరిగింది. ఈ లక్కీడ్రా కార్యక్రమ విజేతలను జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ్ జోన్ రీజనల్ మేనేజర్ షాజు కె.ఆర్. హైదరాబాద్ జోన్ రీజనల్ మేనేజర్ రాజేష్ ఓ.ఎస్. హైదరాబాద్ మేనేజర్ జస్టిస్ జోసెఫ్, రీజనల్ పీఆర్‌ఓ మురళి. ఎస్‌లు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, విజయవాడ జోన్ బంపర్ ప్రైజ్ బీఎండబ్ల్యూ విజేతగా షాలి రామ్‌ప్రసాద్(కూపన్ నెం.165079)నిలిచారు. బంగారు నాణెం విజేతల వివరాలను కూడా ప్రకటించారు.