సానియా మీర్జాకు కేసీఆర్ భారీ నజరానా!

61405972354_625x300హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సానియా మీర్జా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కేసీఆర్ కు సానియా మీర్జా విజ్క్షప్తి చేశారు. సానియా మీర్జా విజ్క్షప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. కేసీఆర్ అందించిన ఆర్దిక సహాయంపై క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కేసీఆర్ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సినందున.. కోటి రూపాయల చెక్ ను మంగళవారం అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అందించే చెక్ ను తీసుకోవడానికి రేపు మళ్లీ కేసీఆర్ ను సానియా కలిసే అవకాశం ఉంది.  యూఎస్ ఓపెన్ టెన్నిస్‌లో పాల్గొనేందుకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో సానియా మీర్జా సీఎంను కలిసి రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.

Leave a Comment