కమర్షియల్ కాంప్లెక్స్పై కూలిన విమానం

5నైరోబి : కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కమర్షియల్ కాంప్లెక్స్పై కుప్ప కూలింది. ఆ ఘటన బుధవారం తూర్పు ఆఫ్రికాలోని కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. నైరోబిలోని జొమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయిందని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
ప్రమాదం జరిగిన విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నారని వారంతా మరణించారని భావిస్తున్నట్లు చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే కమర్షియల్ కాంప్లెక్ పరిసర ప్రాంతాలలోని భవనాలను ఖాళీ చేయించినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు.

Leave a Comment