నటిగా కూడా నిరూపించుకుంటుందట

download (4)కిర్రెక్కించే అందం, చందం వుంటే చాలు అమ్మాయిలు ఈజీగా సినిమా హీరోయిన్స్‌ అయిపోవచ్చు. నటన అంటారా గిరాకీని బట్టి అదే అలవాటయిపోతుంది. ఇప్పటిదాకా చాలా సినిమాలే చేసిన లక్ష్మీరాయ్‌.. సారీ రాయ్‌ లక్ష్మి ఇప్పుడు నటిగా తన సత్తా ఏంటో నిరూపించుకుంటానంటోంది. అంటే ఇంతకాలం నటించకుండా చూపించడమే పనిగా పెట్టుకుందని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా. కాంచన సినిమాలో నటించినా హీరోగా లారెన్స్‌ విశ్వరూపం చూపించడంతో లక్ష్మీరాయ్‌కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. అప్పటికే ఓ క్రికెటర్‌తో అఫైర్‌ వుండడంతో వార్తల్లో ఆమె పేరు నానింది అంతే.

ఇప్పుడు రాయ్‌ లక్ష్మీ ‘రాజాధి రాజా’ అనే మలయాళం డబ్బింగ్‌ సినిమా తెలుగులో అదే పేరుతో వస్తున్న సినిమాలో మమ్ముట్టితో చేస్తుందట. అలాగే అర్జున్‌ నటిస్తున్న ‘రాణి రాణెమ్మా’ సినిమాతోపాటు ‘శృంగార’ అనే కన్నడ సినిమా కూడా ఆమె ఖాతాలో వున్నాయట. వాటిల్లో హీరోయిన్‌గా చేస్తున్నట్లు మనం భావించక్కర్లేదు. ఐటమ్‌ సాంగ్స్‌ కావొచ్చు.. లేదా వ్యాంప్‌ తరహా క్యారెక్టర్స్‌ కావొచ్చు.. మొత్తమ్మీద ఇంతకాలానికి నటన మీద దృష్టి పెట్టిన రాయ్‌ లక్ష్మీని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే.